పిఆర్సి, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై క్యాబినెట్లో నిర్ణయం తీసుకోకపోవడం పట్ల నిరసన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పిఆర్సి, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పై క్యాబినెట్లో నిర్ణయం తీసుకోకపోవడం పట్ల బిజెపి రాష్ట్ర రిటైర్డ్ టీచర్స్,ఎంప్లొయ్స్ సెల్ రాష్ట్ర కార్దినేటర్ తిరువరంగం ప్రబాకర్  తీవ్ర నిరసన వ్యక్తం చేసారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, ఈ క్యాబినేట్ మీటింగ్లో నూతన పిఆర్సి కమీటి వేసి ఐఆర్ ప్రకటిస్తారని, క్యాష్ లెస్ ట్రీట్మెంట్ తగు నిర్ణయం గైకొని వరాలు ప్రకటిస్తుందని తప్పుడు ప్రకటనలు ఇస్తూ, తమ పబ్బం గడుపుకోవడానికి బాకా ఊదుతున్న కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల్లారా ! నిన్న జరిగిన కేబినెట్లో ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదో తెల్పాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన సృష్టం చేసారు.ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పట్ల ఉదాసీన వైఖరి వహిస్తూ, ఈ వర్గాల వ్యతిరేక ప్రభుత్వంగా సృష్టమౌతున్న ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకునేలా చేయాలంటే, ఉద్యమాలు తప్పనిసరి అని, అందుకై తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లంతా పోరుబాటకు సిద్దమై, ప్రభుత్వ మెడలు వంచి మన న్యాయపరమైన డిమాండ్లను సాధించుకోవాలని తిరువరంగం ప్రబాకర్  పిలుపు నిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.