అంద విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

-  విద్యా వ్యవస్థలో చర్యలు తీసుకోవాలి - స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు వందనం రాజు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అంద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వందనం రాజు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కారీని న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్లో కలిసి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వందనం రాజుగారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గాని పట్టణ ప్రాంతాల్లో గాని ఉన్న అంద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని   వారికి ఆర్థిక మరియు జీవనోపాధి కలిగించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు డాక్టర్ ఆదినారాయణ గారు మాట్లాడుతూ ఆదిలీల ఫౌండేషన్ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు వారికి ఆరోగ్యపరంగా విద్యాలయాల్లోని వంట గదులు శుభ్రంగా ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు ఈ సందర్భంగా విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కారీ సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో మాతృదేవోభవ సంస్థ అధ్యక్షులు కే బి శ్రీధర్ సంఘ సేవకుడు యోగేష్ క్షేత్ర పాల్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.