హాస్టల్ కుక్ కు ఘన నివాళి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/ సౌత్ క్యాంపస్: తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో ఇటీవల అనారోగ్యం తో మరణించిన హాస్టల్ కుక్ మహిపాల్ చిత్ర పటానికి దక్షిణ ప్రాంగణంలోని ప్రిన్సిపాల్ కార్యాలయం లో  ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కవిత తోరాన్ మాట్లాడుతూ మహిపాల్ హఠాత్ మరణం చాలా దురదృష్టకరమన్నారు. విద్యార్థులకు చక్కటి భోజనం అందించేవడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ అంజయ్య, డాక్టర్ యాలాద్రి, డాక్టర్ నారాయణ, సునీత, శ్రీకాంత్ వైశాలి, శ్రీమాతా, దిలీప్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.