ఉత్తరాది రాష్ట్రాలను కప్పేసిన మంచుదుప్పటి

- బద్రినాథ్‌ ఆలయ పరిసరాల్లో కనుచూపుమేర పరుచుకున్న హిమపాతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రినాథ్‌ ఆలయాన్ని మంచుదుప్పటి కప్పేసింది. ఆలయ పరిసరాల్లో కనుచూపుమేర హిమపాతం పరుచుకుంది. చమోలీ జిల్లాలోని పలు ప్రాంతాలు మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. జోషీమఠ్‌ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది.హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. ఇండ్లను, రోడ్లను పూర్తిగా మంచు కప్పేసింది. సిమ్లా, మనాలీలోని పలు ప్రాంతాల్లో శ్వేత వర్షం అలుముకొంది. ముఖ్యంగా నరకంద ప్రాంతంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇండ్లు, కార్లపై మంచు పేరుకుపోయింది. అక్కడ రహదారిని హిమపాతం ముంచెత్తింది. రోడ్డుకు ఇరువైపులా భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోనూ భారీగా మంచు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.