పుంగనూరు ఘటనలో 30 మంది పై కేసు నమోదు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం జరిగిన ఘటనపై కేసు నమోదు చేశారు. 30మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేయగా.. ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని.. వారిని గుర్తించే పనిలో ఉన్నామన్నారు. IPC 147,148,332,353,128B, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం, ప్రభుత్వ అధికారులపై దాడులు, విధినిర్వహణలో దాడి, దొమ్మీ, ముందస్తు ప్రణాళికతో దాడి అభియోగాలను మోపారు.అలాగే పుంగనూరు ఘటనపై విచారణ చేయాలని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లను ఆదేశించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని.. వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారన్నారు. ఈ ఘటనలో రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పవన్నారు.సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నామని.. ఇప్పటికే అనేకమంది నిందితులను గుర్తించామని తెలిపారు. మరికొందరి కదలికలపై నిఘా పెట్టామన్నారు డీజీపీ. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందని.. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉందన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టామని.. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు.పుంగనూరులో టీడీపీ నేతలు దాడిలో గాయపడిన పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని డీఐజీ అమ్మిరెడ్డి తెలిపారు. నాయకులు పార్టీ సిద్ధాంతాలపై వ్యాఖ్యానించాలని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడకూడదన్నారు. తాము ఎవరికీ అడ్డు చెప్పలేదని.. టీడీపీ వాళ్లు కార్యక్రమంలో తాము మార్పులు చేశామని.. బైపాస్ రోడ్డులో వెళతామని చెప్పారన్నారు. వీఐపీ వచ్చే కొద్దీసమయంలోనే టౌన్‌లోకి తీసుకొస్తామని ప్రొరోక్ చేశారన్నారు.ఉద్దేశపూర్వకంగానే రాళ్లతో దాడి చేశారని.. పోలీసులు సహనంతో సమన్వయంతో ఉద్యోగం చేశారన్నారు. కానీ టీడీపీవాళ్లు దాడి చేశారని.. 13 మందికి పోలీసులకు గాయాలు అయ్యాయన్నారు. ఒక కానిస్టేబుల్ కన్ను గుడ్డు కూడా బయటకు వచ్చిందని.. దాడి చేసిన వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గాయపడిన పోలీసులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటనలో ఉద్రిక్థ పరిస్థితులు కనిపించాయి. టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. కొందరు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ముందుగానే అనుకుని పక్కా ప్లాన్ ప్రకారం దాడికి తెగబడినట్లు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు బైపాస్ మీదుగా వెళతారని రూట్ మ్యాప్ ఇచ్చారని.. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి ప్లాన్ మార్చి పుంగనూరులోకి వచ్చేందుకు ప్రయత్నించారన్నారు.

Leave A Reply

Your email address will not be published.