నాడు చెత్తకుండీలో చిన్నారి..నేడుఅసిస్టెంట్ కమిషనర్‌ హోదాలో

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఏ తల్లి కన్న బిడ్డో.. చెత్తకుప్ప పాలైంది.. అదృష్టం బావుండి ఓ నాన్న కాని నాన్న కంట పడింది. అసోంలోని తీన్ సుఖియా జిల్లాకు చెందిన సోబరన్‌‌ బండిమీద కురగాయలు పెట్టుకుని వీధివీధి తిరుగుతూ అమ్ముతుండేవాడు. అదే ఆధారంగా బతుకుతున్నాడు. తల్లి దండ్రులు ఇద్దరూ పెద్దవారు కావడం వారిని చూసుకునే బాధ్యత తనపై పడడంతో పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచించలేకపోయాడు. రోజులానే ఓ రోజు కూరగాయలు అమ్మి చీకటి పడిన తరువాత ఇంటికి వస్తున్నాడు. ఇంతలో ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది. పరుగున వెళ్లి చుట్టూ చూశాడు. పాప తాలూకూ ఎవరూ కనిపించలేదు. ఏజన్మ బంధమో నాకోసమే పుట్టిందేమో అనుకుని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. అమ్మానాన్నా అన్నీ తానై పెంచి పెద్ద చేశాడు. 25 ఏళ్లు వచ్చిన ఆ అమ్మాయి. నాన్నా నీ కష్టం ఊరికే పోలేదు. అసిస్టెంట్ కమిషనర్ అయ్యానంటూ తనకి ఉద్యోగం వచ్చిన ఆర్డర్స్ తండ్రి సోబరన్ చేతిలో పెట్టింది. ఆ మట్టిలో మాణిక్యం.

Leave A Reply

Your email address will not be published.