ఆర్థిక అసమానతలు, అవినీతి లేని దేశం గా తీర్చిదిద్దాలి

- రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆర్థిక అసమానతలు లేని – అవినీతి లేని దేశంగా భారతదేశాన్ని తీర్చి దిద్దాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత లేని దేశంగా, ఆకలి – అజ్ఞానం-అసమానతలు, దోపిడి, పీడన వివక్ష , అణచివేతలు లేని దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దాలని అందుకు విద్యార్థులు యువకులు కృషి చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. నేడు అంబర్ పేటలో బీసీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలలో కృష్ణయ్య జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  దేశానికి స్వతంత్రం వచ్చి 75  సంవత్సరాలు గడిచిన ఇంకా 48 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. అభివృద్ధి ఫలాలు ఈ వర్గాలకు అందడం లేదు. దేశ సంపద ఒక శాతం ప్రజల చేతుల్లోనే  95 శాతం సంపద కేంద్రీకృతం అయిఉంది. దీనిని వికేంద్రీకరణ చేసే విధానాలు కావాలి. ఒకరు కోట్ల సంపదతో ఏ ఖర్చు పెట్టాలో తెలియని వర్గం – ఇంకొక వైపు డబ్బులు లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొనే వర్గం – అలాగే ఒక పెద్ద బంగ్లాలో 40 రూములుంటే ఇద్దరు – ముగ్గురు ఉన్నారు. ఇంకొక వైపు ఇళ్ళు లేక అద్దె ఇంట్లో ఒక రుములోనే ఆరు మంది ఉన్న తీరు ఉంది. ఇంకా గ్రామాలలో సామాజిక అసమానతలు, అశ్రుస్యత కొనసాగుతుందని విమర్శించారు. ఆర్థిక అసమానతలు –  సామాజిక వివక్షత యున్నంతకాలం భారతదేశం అగ్రదేశంగా రూపుదిద్దుకోజాలధన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలి. అందుకోసం ప్రభుత్వ విధానాలు మార్చే వ్యవస్థ కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మనిషిని – మనిషిగా గౌరవించే వ్యవస్థ కోసం యువత పోరాడాలి. భారతీయ సమాజంలో ఇంకా రాజకీయ సంస్కరణలు, పాలన సంస్కరణలు రావాలి. వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ – సాంకేతిక రంగాలలో మరిన్ని పరిశోధనలు జరుగాలి. నూతన ఆవిష్కరణ జరుగాలన్నారు.భారతదేశం ప్రపంచంలో అన్నీ దేశాల కంటే మేదా సంపత్తిలో ముందున్నాది. ప్రపంచ స్థాయి మేదావులు, శాస్త్రవేత్తలు మన దేశంలోనే యున్నారు. మానవ వనరులు, మెదాసంపత్తి సక్రమంగా వినియోగిస్తే మన దేశంలో పేదరికం – నిరుద్యోగం పూర్తిగా తొలగిపోతుంధన్నారు.

        ఆర్.కృష్ణయ్య ప్రసంగాన్ని కొనసాగిస్తూ  స్వాతంత్ర్యo వస్తే భారతదేశంలో సామాన్యుడికి అవసరమైన విద్య, వైద్యo, ఉద్యోగాలు, ఉపాది అవకాశాలు, వనరులపై సాధికారత  సాధ్యమవుతుందనుకున్నారు. రాజ్యాంగం నిర్మాణంతో మన హక్కులు పరీక్ష పంచబడతాయి అనుకున్నారు. కానీ నేటి భారతదేశ సమకాలీన, ఆర్థిక, రాజకీయ, సామాజిక, వాతావరణంలో భారత స్వతంత్ర మూల సిద్ధాంతం  విస్మరించబడి ధనికులు ఇంకా ధనికులుగా మారుతూ లెక్కలేనంత సంపాదనతో, రాజకీయ అధికారంతో తులతూగుతూ ఉండగా, పేదవారు – మధ్య తరగతి వారు  ఎండిన పేగులతో, మాడిన డొక్కలతో, రెక్కాడితేగాని – డొక్కా డని దుర్భర పరిస్థితిలో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారన్నారు.

        ప్రపంచ దేశాలలో అఖండంగా వెలిగిపోతున్న భారతావని సాంకేతిక ఎదుగుదలతో అద్భుతాలను సృష్టిస్తూ, అంతరిక్షంలో చంద్రయాన్ లాంటి వినూత్న ఆవిష్కరణలతో కరోనా కు వ్యాక్సిన్ కనిపెట్టడంలో ప్రపంచానికే మార్గదర్శకంగా ముందుకు దుసుకుపోతున్నాము. అవినీతిని అంతమొందించే దిశగా ప్రయాణం చేస్తూన్నాం. అలాగే రైతులకు నిరంతర విద్యుత్, పెట్టుబడి సాహయం, వ్యాపారానికి అనుకూలమైన రవాణా, జాతీయ మార్గాలను విస్తరింప చేస్తూ స్వయం ఉపాధి, నిత్యావసరాల సమర్థ పంపిణీతో ఆర్ధిక వ్యవస్థను పరిపుష్టి చేస్తున్నాం. అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని పెంపొందించుకుంటూ పలు సామాజిక  ఈ పరిణామాలతో దేశం దూసుకెళ్తోంది. దేశ అంతర్గత భద్రతకు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ శత్రు దేశాల పట్ల పటిష్ట వ్యూహ విధానాలు అవలంబిస్తూ, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకుంటూ, వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నాము. – ఇంకోపక్క మహిళలపై, బాలలపై అత్యాచారాలు, బలహీనులపై బలవంతుల దోపిడి, పీడన, సమాన హక్కుల సహకారం అవ్వకపోవడం, ఆదివాసీలపై – దళితులపై, బి.సి లపై దాడులు, రైతన్నల – నేతన్నల ఆత్మహత్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, జలవివాదాలు, దిగజారుతున్న విద్య – వైద్య ప్రమాణాలు, స్వతంత్ర భారతావనినీ ఇంకా తీవ్రంగా వేదిస్తునే ఉందని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

        భారతదేశం స్వాతంత్రానంతరం శాస్త్ర -సాంకేతిక రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించినా ధనిక-పేదల మధ్య ఇప్పటికే ఎంతో ఆంతర్యం కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక వ్యత్యాసాలు భారత స్వతంత్ర ఫలాలు అందుకోవడం సగటు భారతీయుల అభివృద్దికి అవరోధంగా ఆటంకంగా ఉన్న విషయాన్ని రాజకీయ నాయకులు, మేధావులు  ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని వర్గాలు అధికారం చేజిక్కించుకోవడానికి పార్టీలను చేతుల్లో పెట్టుకోదు. ధన బలం, అంగ బలం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజల మధ్య వ్యత్యాసాలు తగ్గి ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి ప్రభుత్వం అధికారంలోకి  వచ్చినప్పుడే అన్ని వర్గాల మధ్య అంతరాలు తగ్గి భారత స్వతంత్ర అభీష్టము సిద్ధిస్తుంది. అగ్ర దేశంగా అభివృద్ధి చెందుతుంది.

        75 సం.రాల తర్వాత కూడా భారత ప్రజలు ఓటు విలువ తెలుసుకోవడం లేదు. – ఓటు అంటే ప్రధానమంత్రి – ఓటు అంటే ముఖ్యమంత్రి పదవితో సమానం. మనం ఓటు వేస్తే MP గా గెలిచి  ప్రధానమంత్రి అవుతున్నారు. అంటే మన ఓటు ప్రధానమంత్రి పదవితో సమానం కదాయని ప్రశ్నిoచారు.  భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకోవాలి. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి. భారతదేశ  సౌభాగ్యానికి పాటుపడే సరైన నాయకులను, రాజకీయ పార్టీలను ఎన్నుకొని మన బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించినప్పుడే భారతదేశ స్వతంత్ర లక్ష్యాలు నెరవేరుతాయి. శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థతో పాటు ఎప్పటికప్పుడు ముందుకు వచ్చే వైజ్ఞానిక ఆవిష్కరణలు, ప్రజల ఆకాంక్షలు, ఉద్యమాలు సమన్వయంతో ముందుకు సాగినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెంది సంక్షేమ రాజ్యంగా అబివృద్ధి చెందిన అగ్ర రాజ్యాంగ ఆవిర్భవిస్తుంది. దేశం సస్యశ్యామలం అవుతుంది. ఈ దిశగా ప్రభుత్వ విధానాలలో మార్పు, భారత రాజ్యాంగంలో పలు సవరణలు చేసి SC/ST/BC లకు దక్కవలిసిన వాటా దక్కలని కోరారు.

భారతదేశంలో విస్తృతమైన సంపద ఉంది. సంపదను వినియోగించుకునే  మేధాసంపత్తి ఉంది. కానీ దీనిని అందరికీ సమానంగా పంచే ప్రభుత్వ యంత్రాంగం లేదు, పాలనా విధానాలు లేవని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో ఉన్న లోపభూయిష్టమైన, మౌలిక విధానాలు మార్చకుండా ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. జపాన్, జర్మనీ, చైనా, ఇంగ్లాండ్, యూరోపియన్ దేశాలలో వచ్చిన అభివృద్ధి వెనుక ఉన్న చరిత్రను చూసి మన పాలకులు విధానాలు మార్చుకోవాల్సి అవసరం ఉంది. రాజకీయ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, పాలన సంస్కరణలు తీసుకరావలిసిన అవసరం ఉంది. ప్రజలు కూడా ముఖ్యంగా ఉజ్వల భవిష్యత్తు గల యువకులు – విద్యార్థులు దేశభక్తి, జాతీయ భావాలు, శ్రమ, సంస్కృతి అలవర్చుకొని పటిష్టమైన జాతీయ నిర్మాణం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.