రాష్ట్రంలో డ్రగ్స్‌ రవాణా, వాడకంపై ఉక్కుపాదం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో డ్రగ్స్‌ రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపి డ్రగ్స్‌ వ్యవస్థను అడ్డుకుంటామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో శుక్రవారం అన్ని జిల్లాల అధికారులతో ఎన్‌డీపీఎస్‌ చట్టం, దర్యాప్తు ప్రక్రియపై నిర్వహించిన ఒకరోజు శిక్షణను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కోటిక్స్ డ్రగ్స్ ,సైకోట్రోపిక్ పదార్థాలు యువతను పెడదారిన పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సమాజంలోని కొన్ని వర్గాలల్లో మాదకద్రవ్య వ్యసనం ప్రబలంగా మారిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రవాణా వ్యవస్థీకృత నేరంగా మారిందని, గొలుసుకట్టు కేసులను విచ్ఛిన్నం చేయడానికి శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేయాలని సూచించారు. మూలాల గమ్యాన్ని గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే డ్రగ్స్‌ను కంట్రోల్‌ చేయవచ్చని తెలిపారు.ఎన్‌డీపీఎస్‌ చట్టంలో నిర్దేశించిన విధానం ప్రకారం డ్రగ్స్‌ స్వాధీనం సక్రమంగా చేపట్టాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐడీ ఏడీజీపీ మహేశ్‌ ఎం భగవత్‌ మాట్లాడుతూ గత సంవత్సరం తెలంగాణలో 214 మంది నేరస్థులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌ ఎ. రాంగధన్,నార్కొటిక్‌ సెల్‌ ఎస్పీ సి.అనసూయ తదితరులు శిక్షణలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.