గాల్లో ఎగిరే కారు వచ్చేస్తోంది..! ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల మైలేజీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సాదారణంగా ఇప్పటివరకు మీరు ఎలక్ట్రిక్ కార్లు, మాగ్నెటిక్ కార్లు, సోలార్ కార్లు చూసుంటారు. మరి ఎప్పుడైనా ఎగిరే కార్లను చూశారా..? కారు, బస్సు వంటివి రోడ్డుపై నడుస్తాయి. హెలికాప్టర్, విమానం వంటివి గాలిలో ఎగురుతుంటాయి. కానీ కారు గాల్లో ఎగిరితే ఎలా ఉంటుంది..? ఏంటి ఇది ఏమైనా సినిమానా అనుకుంటున్నారా..? కాదండి నిజమే.. మార్కెట్ లోకి త్వరలోనే ఎగిరే కార్లు రానున్నాయట..! వివరాల్లోకెళ్తే.. త్వరలో అమెరికాలో ప్రారంభమయ్యే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో అస్కా (ASKA) అనే కంపెనీ ఈ తరహా ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించనున్నట్లు ప్రకటించుకుంది. ఇప్పటికే వివిధ ఆటోమోటివ్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ఈ CES షోలో ప్రదర్శించనున్నట్లు ప్రకటించాయి. వీటిలో వోక్సవ్యాగన్ తన కొత్త ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్‌ను బహిర్గతం చేయనుండగా.. ఆడి వర్చువల్ రియాలిటీ ద్వారా నడిచే వినోద వ్యవస్థను ప్రదర్శించనుంది. వీటితో పాటు అస్కా ఎగిరే వాహనాన్ని ప్రకటించడంతో ఆ షోపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ ఎగిరే కారు ఎలా ఉంటుందంటే..?
నలుగురు ప్రయాణికులకు చోటు కల్పించే తన ఎగిరే వాహనాన్ని పబ్లిక్ రోడ్లపై నడపవచ్చని అస్కా ప్రకటించుకుంది . దీనిని జనవరి 5 నుంచి జనవరి 8 వరకు జరిగే 2023 CESలో ఈ వాహనం నమూనాను ఆవిష్కరించనుంది. రోడ్డుపై ఎలక్ట్రిక్ కారుగా నడవడంతో పాటు క్వాడ్‌కాప్టర్ గా కూడా గాలిలో ఎగురుతుందని అస్కా స్పష్టం చేసింది. అయితే ఈ కారు ఎన్నిరోజుల్లో అందుబాటులోకి రానుందో తెలుపలేదు. తాజా సమాచారం ప్రకారం 2026లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్‌ ఇలా ఉండనున్నాయి..!
విద్యుత్ తో నడిచే ఈ కారులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. నలుగురు కూర్చొని ప్రయాణి చేయవచ్చు. గాలిలో ఎగురుతున్నప్పుడు వేగం 240 కిలీమీటర్ల ఉంటుంది. రోడ్డుపై రన్నింగ్ స్పీడ్ 112 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. VTOL (వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్), STOL (షార్ట్ టేకాఫ్ ల్యాండింగ్) టెక్నాలజీతో పనిచేస్తుంది.

Leave A Reply

Your email address will not be published.