స్వాతంత్ర సమరయోధుడు కుటుంబానికి న్యాయం చేయాలి

- కోవూరి మొగులయ్య గౌడ్ ఇచ్చిన  పది ఎకరాల భూమిని వెంటనే  ధరణిలో చేర్చాలి - సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు, ఆందోళనలు - నిర్లక్ష్యం వహిస్తే తగిన బుద్ధి చెప్తాం-జాతీయ బీసీ సంక్షేమ సంఘం న్యాయవాది  కోవూరి సత్యనారాయణ గౌడ్.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్వాతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ ఇచ్చిన  పది ఎకరాల భూమిని వెంటనే  ధరణిలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సమాజ్ పార్టీ నాయకులు, బీసీ సంక్షేమ సంఘం ఆద్వర్యం లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.  పది ఎకరాల భూ పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే స్వాతంత్ర సమరయోధుడు ఆశయాల మేరకు పనిచేస్తున్న 10 లక్షల మందితో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణిలో డి.ఆర్.ఓ నగేష్ గారికి  ఫిర్యాదు చేసారు.ఈ సందర్బంగా  జాతీయ బీసీ సంక్షేమ సంఘం న్యాయవాది  కోవూరి సత్యనారాయణ గౌడ్  మాట్లాడుతూ  స్వాతంత్ర సమరయోధుడు  కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్  ద్వారా  స్వాతంత్ర సమరయోధుడు  ఆశయాల కోసము  తెలంగాణ రాష్ట్రాన్ని   ప్రపంచానికి ఆదర్శ రాష్ట్రంగా,  అభివృద్ధి చెందిన రాష్ట్రంగా,  సంపూర్ణంగా పేదరికం నిర్మూలించిన రాష్ట్రంగా,  తీర్చి దిద్దుట కోసం దేశభక్తి భావంతో నిరంతరం పనిచేస్తుంది అని  అందుకు అధికారికంగా  స్వాతంత్ర సమరయోధుడు  కోవూరి మొగులయ్య గౌడ్  గారికి  సిద్దాపురం గ్రామం,  సర్కల్ కొండాపూర్,ఉమ్మడి మెదక్ జిల్లా( ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా) లో  10 ఎకరాల  గైరాన్ భూమి,  ఫైల్ నెంబర్ A2/1113/60,  సర్వే నంబర్ 267 లో  కేటాయించినారు  అని తెలియజేస్తూ ఇట్టి విషయంలో  కేంద్ర ప్రభుత్వం  మంత్రులు మరియు  రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు  హరీష్ రావు గారు ,  రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా   ప్రజాస్వామ్యంలో కొనసాగుతున్న ప్రజల సంక్షేమం కోరే రాజకీయ పార్టీలు అన్నీ కూడా  స్వాతంత్ర సమరయోధుడి ఆకాంక్షను నెరవేర్చుటలో భాగంగా అతనికి కేటాయించిన 10 ఎకరాల గైరాన్ భూమిని  ఇప్పించుటలో సంపూర్ణ మద్దతును ప్రకటించాయి స్వాతంత్రం సాధించుకొని 75 సంవత్సరాలు గడిచిన కూడా 11 నెలల జైలు శిక్ష అనుభవించిన  తన జీవితాన్ని త్యాగం చేసిన  మహనీయుడు  స్వతంత్ర సమరయోధుడు కోవూరి మొగులయ్య గౌడ్ కు న్యాయం జరగాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.