కేజీబీవీ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జాతీయ మ్యాథమెటిక్స్ డే పురస్కరించుకొని చౌటుప్పల్ లోని కేజీబీవీ పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీరాములు పిఎస్విజి ఫౌండేషన్ చైర్మన్ పాలకుర్ల మురళి ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీరాములు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గణితం అంతే ఏమిటి, ఘనిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, గణితంలో మెలకువలు గురించి విద్యార్థులకు సోధారణంగా వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత శాస్త్రంలో ప్రతిభ పోటీలతోపాటు విద్యార్థినిలకు రంగవల్లి పోటీలు కూడా నిర్వహించారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కే.భవాని తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.