గ్రామీణ జానపద కళలకు మళ్ళీ పెరుగుతున్న ఆదరణ

-  బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్

  తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శాస్త్ర, సాంకేతిక రంగాలలోఎంత  పురోగతిసాధించినా మనిషి మానసిక వేదనను,శారీరక అలసట ను తీర్చుటలో వినోదం, సంగీతం ముఖ్య భూమికపోషిస్తాయని, బీసీసేన రాష్ట్రఅధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామంలో యాదవసంఘం యువకులు డోలు వాయించడంలోశిక్షణ తీసుకుంటున్న కార్యక్రమానికి హాజరైన బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ గ్రామీణజానపద కళలకు ప్రాణం పోస్తున్నయువతను అభినందించారు. కొన్నివేల సంవత్సరాల క్రితమే భారతీయ గ్రామీణ ప్రాంతాలలో జానపద కళలు,డోలు, తపెట, తంబూరా, లాంటి సంగీత పరికరాలు ఆవిర్భవించాయని,న్యాయం, ధర్మం, సేవా గుణం,మానవుని క్రమబద్ధమైన జీవన విధానానికి జానపదకళ లేమూలాధారమని, జానపద కళలను గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని వేరు చేయలేనంతగా కలిసి ఉంటాయని తెలిపారు.భారతీయుల జీవన విధానాన్ని ,కళలను ప్రపంచ దేశాలు కొనియాడు తున్నాయని, ఎన్ని అవంతరాలు ఎదురైన,  నేటికీ గ్రామీణ సంస్కృతి చెక్కుచెదరలేదని గ్రామీణ కళలను ప్రదర్శిస్తున్న యువతకు ప్రభుత్వం అండగా నిలిచి ప్రోత్సహించాలని అప్పుడే మరుగున పడ్డ మరిన్ని ప్రాచీన కలలు వెలుగులోకి వస్తాయనిఅన్నారు, ఈ కార్యక్రమం లో, శ్రీనివాసులు, గోరంట్ల పరమేష్యాదవ్, బైకని కృష్ణయాదవ్ మెడిపూరి వెంకటేష్ యాదవ్,మెడిపూరి మహేష్, గోరంట్ల చిరంజీవి యాదవ్,గోరంట్ల ఉదయ్ ,గోరంట్ల సంజయ్ యాదవ్,సిద్దు,రవి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.