దక్షిణ మధ్య రైల్వేకు అవార్డుల పంట

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: దక్షిణ మధ్య రైల్వే కు అవార్డుల పంట పండింది. విద్యుత్‌ పొదుపు అంశాల్లో ఏడు నేషనల్‌ ఎనర్జి కన్జర్వేషన్‌ అవార్డులు అందుకున్నట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈ అవార్డులు 2023 సంవత్సరంలో చేసిన విద్యుత్‌ పొదుపు మేరకు దక్కాయన్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ దశలోనే ఇంధన పొదుపు అవార్డులను ప్రకటిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని వివరించారు.దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టం (పీఆర్‌ఎస్‌) ప్రథమ బహుమతి, విజయవాడలోని వ్యాగన్‌ డిపోకు ప్రథమ బహుమతి వచ్చిందని వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ద్వితీయ బహుమతి, లేఖా భవనానికి ద్వితీయ బహుమతి, రేటిగుంట, గుంతకల్‌ రన్నింగ్‌ రూంలకు మెరిట్‌ సర్టిఫికెట్లు‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఆఫీస్‌కు మెరిట్‌ సర్టిఫికెట్లు దక్కాయన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.