మేడ్చల్ లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: జాతీయ ఉపాధి హామీ పథకం లో రైతు కల్లాల నిర్మాణం పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కే టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మేడ్చల్ పట్టణం వివేకానంద విగ్రహం దగ్గర బీ ఆర్ ఎస్ జిల్లా శాఖ ఆద్వర్యం లో భారీ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీ పూర్ రాజు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ ,జిల్లా బీ ఆర్ ఎస్ నేతలు రైతులు పాల్గొన్నారు. కల్లాల నిర్మాణం పై కేంద్రం విధించిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని లేదంటే రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు.ఆయన ప్రసంగం లోని ప్రధాన అంశాలు. రైతుల కల్లాలతోనూ కయ్యమా ..అపుడు వడ్లు కొనమంటే కొనమన్నారు.. ఇపుడు వడ్లు ఆరబోసుకునేందుకు కల్లాలు కూడా వద్దంటున్నారు? ..రైతులు రోడ్ల మీదనే వడ్లు ఆరబోసుకోవాలి.. వారిని రోడ్ల మీదనే ఉంచాలనేది బీజేపీ కుట్ర ..రైతులు కల్లాలు లేక రోడ్ల మీద వడ్లు ఆరబోస్తే వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి.. ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి..మనుషుల ప్రాణాలంటే బీజేపీ కి కేంద్ర ప్రభుత్వానికి లెక్క లేదా.. కార్పొరేట్ గద్దలకు కోట్లాది రూపాయలు దోచి పెడుతున్న మోడీ రైతుల కల్లాల కోసం ఇచ్చిన 150 కోట్ల రూపాయలను వెనక్కి అడుగుతారా
…ఇది 150 కోట్ల రూపాయల సమస్య కాదు..మూడున్నర కోట్ల తెలంగాణ ఆత్మగౌరవ సమస్య.. ..దేశాన్ని నడిపించమంటే మోడీ రైతును ఎడిపిస్తున్నాడు …ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే మీన మేషాలు లెక్కిస్తున్నారు ..బీజేపీ మేనిఫెస్టో లో పెట్టిన హామీ కే దిక్కు లేకుండా పోయింది …రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వారి కష్టాలను బీజేపీ రెట్టింపు చేసింది ..రైతుల పాలిట బంధువు బీ ఆర్ ఎస్ అయితే రాబంధు బీజేపీ …రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల తో రైతు ఇష్టంగా వ్యవసాయం చేస్తుంటే బీజేపీ ఓర్చు కోలేక పోతోంది …బీజేపీ కి బీ ఆర్ ఎస్ తో ఇబ్బంది ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి . తెలంగాణ రైతు పై పగ పట్టడం దేనికి.. …కేంద్ర ప్రభుత్వానికి విధానం లేదు విద్వేషమే ఉంది ..రైతులకు అండగా ఉండేది కేసీఆర్ ప్రభుత్వమే.. వ్యవసాయాన్ని విద్వంసం చేసే బీజేపీ కి రైతులు తగిన బుద్ధి చెబుతారన్నారు.

Leave A Reply

Your email address will not be published.