అంకుర హాస్పిటల్‌ లో భారీ అగ్నిప్రమాదం

ఆరో అంతస్తులో మొదలై మొదటి అంతస్తు వరకు వ్యాపించిన మంటలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నగరంలోని గుడిమల్కాపూర్‌ లో గల అంకుర హాస్పిటల్‌ లో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంకుర హాస్పిటల్‌లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్‌ సిబ్బంది , పోలీసులు 4 ఫైరింజన్లు మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. అగ్ని ప్రమాద ఘటనతో అప్రమత్తమైన అంకుర హాస్పిటల్‌ సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రి నిర్వహిస్తున్న ఆరు అంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.తొలుత ఆరో అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. ఆస్పత్రిలో రోగులు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో రోగులు ఆందోళనలో ఉన్నారు. ఆయా ఫ్లోర్‌లో ఉన్న రోగులను సిబ్బంది బయటికి పంపించి వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.