రైతులతో మమేకమైన శాసనసభాపతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తా వద్ద తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నుండి హైదరాబాద్ బయలుదేరి పద్మాజివాడి చౌరస్తా వద్ద రైతులని చూసి తన వాహనాన్ని ఆపినారు,అక్కడే రైతులతో వున్నా మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు తో కాసేపు మాట్లాడి అతి సామాన్యులు వెళ్లే చిన్న హోటల్ లో వెళ్లి రైతులకు అల్పాహారం చేపించడంతోపాటుతాను అల్పాహారం చేసి అందరి బిల్లులను చెల్లించారు. కార్యకర్తలకు ముఖ్యంగా రైతులకు పంటలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేవిధంగా వ్యవసాయం చేయాలన్నారు రాబోయే రోజులల్లో ఆహారత కోరత ఏర్పడే పెను ప్రమాదం ఉందన్నారు,రైతులు దైర్యం గా రెండు దపాలు గా వరి పంట పండించుకోవచన్నారు, ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు,కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకం విధానాల వల్ల 2014 సంవత్సరంలో ఆహార భద్రతలో 55 లో ర్యాంకులో ఉన్న భారతదేశం 2022 సంవత్సరం వచ్చేసరికి 107 వ ర్యాంకుకు పడిపోయిందన్నారు, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు చేయూతనిస్తు దేశానికి అన్నం పెట్టే రైతులను పట్టించుకోవడం లేదన్నారు ,గ్రామాలు అభివృద్ధి చెందిననాడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఈరోజు వ్యవసాయంలో తెలంగాణ రైతులు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నారని అన్నారు. బాన్స్‌వాడ నియోజకవర్గంలో రైతులు సంవత్సరానికి ఖరీఫ్ రబీ సీజన్లో పండించిన పంటకు 1500 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నారన్నారు ,సహచర ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో మాట్లాడి సదాశివనగర్ మండలంలో రబీ సీజన్‌కు ముందు 2000 మంది రైతులతో రైతు సదస్సు ఏర్పాటు చేస్తే తాను వచ్చి రైతులకు అవగాహన కల్పిస్తానని తెలిపారు, రైతులతో ముచ్చటిస్తూ తాను వంశ పరంపర్యంగా రైతునని రైతు కుటుంబం నుండి వచ్చానని రైతులతో పంట వివరాలు వారి బాగోగులు అడిగి తెలుసుకుంటానన్నారు. కార్యక్రమం లో సదాశివనగర్ మండల ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.