6ఏళ్ల చిన్నారిని చంపిన చిరుతపులి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహారాష్ట్రలోని నాసిక్‌లో డిసెంబర్ 24న చిరుతపులి దాడిలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అటవీశాఖ చిరుతపులి కోసం విస్తృత గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే సోమవారం చిరుతను బంధించారు అధికారులు. విషయం ఇగత్‌పురిలోని తాలేగావ్‌కి సంబంధించినది. సోమవారం ఉదయం 8 గంటలకు తలేగావ్‌లో చిరుతపులి కనిపించినట్లు సమాచారం అందిందని అటవీ శాఖ ఆర్‌ఎఫ్‌ఓ అధికారి కేతన్ బిరారీ తెలిపారు.

సమాచారం అందిన వెంటనే అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల తరబడి శ్రమించి చిరుతను రక్షించారు. 6 ఏళ్ల చిన్నారిని చంపిన చిరుత ఇదేనని పలువురు భావిస్తున్నారు. అటవీ అధికారి కేతన్ బిరారీ మాట్లాడుతూ.. ‘చిరుతపులి అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. చిరుతను పట్టుకున్నామని, దానికి చికిత్స అందిస్తున్నట్టుగా చెప్పారు. డిసెంబర్‌ 24న 6ఏళ్ల బాలుడిని చిరుత పొట్టనబెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే చిరుతను బంధించినట్టుగా చెప్పారు. మృతుల కుటుంబానికి 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.