అద్భుత శిల్పకళానిలయము బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నాగార్జనసాగర్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన, బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్, బుద్ధవనం ఒక అద్భుత శిల్పకళానిలయమని, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐడీసీ) మేనేజింగ్ డెరైక్టర్, వైస్ చైర్మన్, నరసింహారెడ్డి అన్నారు. టీఎస్ఐఐడీసీ, అధికారుల సమావేశాల సందర్భంగా నాగార్జునసాగర్ వచ్చిన ఆయన గురువారం టీఎస్ఐఐడీసీ, సీఈవో, మధుసూదన్‌తో కలిసి బుద్ధవనాన్ని సందర్శించారు.బుద్దవనం ప్రత్యేకాధికారి, మల్లేపల్లి లక్ష్మయ్య బుద్ధవనం లోని వివిధ పర్యాటక ఆకర్షణలు, వాటి ప్రత్యేకతలను వివరించారు. బుద్ధవనంలో కృష్ణాతీరం వద్ద గల వ్యూపాయింట్ ను సందర్శించి..  ప్రకృతి ప్రేమికుల కోసం వ్యూపాయింట్ ను అభివృద్ధి చేయ వచ్చన్నారు.బుద్ధవనంలోని ప్రధాన ఆకర్షణ అయిన మహా స్థూపం చుట్టూ అలంకరించిన శిల్పఫలకాల్లోని బుద్ధుని జీవితం, జాతక కథలు, బౌద్ధ సాంసృతిక అంశాలను బుద్ధవనం, బుద్దిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్‌  డా. ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో బుద్ధవనం అధికారులు, కె.మధుసుదన్ రెడ్డి, డి.అర్. శ్యాంసుందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.