హబ్సిగూడలో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హబ్సిగూడలోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ ఇంకా దట్టంగా పొగలు వస్తుండటంతో భయాందోళనలకు గురవుతున్నారు.హబ్సిగూడలోని రెండో అంతస్తులోని ఓ హోటల్‌లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్త మొదటి అంతస్తులోని అన్‌లిమిటెడ్‌ షోరూంలోకి కూడా వ్యాపించాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా మూడు ఫైర్‌ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో 10 ఫైర్‌ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్ని ప్రమాదం జరిగిన భవనం పక్కనే పెట్రోలు బంక్‌ ఉండటంతో ముందు జాగ్రత్తగా పోలీసులు దాన్ని మూసేయించారు. అయితే మంటలు ఆర్పినప్పటికీ.. ఆ భవనంలో నుంచి దట్టంగా పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో ఉప్పల్‌ – సికింద్రాబాద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అగ్నిప్రమాదం జరిగిన దుకాణాల నుంచి జీహెచ్‌ఎంసీ అద్దాలు తొలగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.