యాదాద్రీశుడి దర్శనానికి వెళ్తున్న భక్తులకు తప్పని అగచాట్లు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  కష్టాలు తీర్చమని వేడుకునేందుకు ఆ యాదాద్రీశుడి దర్శనానికి వెళ్తున్న భక్తులకు.. అక్కడా అగచాట్లు తప్పడం లేదు. వేసవి ప్రారంభానికి ముందే మండే ఎండలతో నరసింహుడి దర్శనానికి వెళ్తున్న భక్తులు కొండపై అవస్థలు పడుతున్నారు. ఎర్రటి ఎండల్లో ఆలయ తిరువీధుల్లోని కృష్ణరాతి శిలలపై అడుగుతీసి అడుగు వేయలేక పరుగులు తీస్తున్నారు. గత వేసవిలో భక్తులు ఎండ తీవ్రతకు కొండపైన నడవలేక ఇబ్బందులు పడుతుండడంతో ఆలయ తిరువీధుల్లో కూల్‌ వైట్‌ పెయింట్‌, చలువ పందిళ్లు వేశారు. అయితే ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఈక్రమంలోనే ఆలయ తిరువీధుల్లో పాదరక్షలతో నడవకూడదని తెలిసినా కొందరు భక్తులు ఎండలకు తట్టుకోలేక ఆ పనే చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.