వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోన్నతీవ్ర అల్పపీడనం

- అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం - ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి జిల్లాలలో  రెడ్‌ అలర్ట్‌ - 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగో గాలులు వీస్తాయి ..వాతావరణ శాఖ వెల్లడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వాయువ్య బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తీవ్ర అల్ప పీడనానికి అనుబంధంగా ఆవర్తనం కూడా ఏర్పడింది. దీని కారణంగా బుదవారం ,గురువారం  అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశ ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

రెడ్‌ అలర్ట్‌ : ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి

ఆరెంజ్‌ అలర్ట్‌ : నిర్మల్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల

ఎల్లో అలర్ట్‌ : ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో కుంభవృష్టి వానలు కురిశాయి. మరో మూడు జిల్లాల్లో అత్యంత భారీ, ఐదు జిల్లాలో అతి భారీ, పది జిల్లాలో అక్కడక్కడ వానలు పడ్డాయి. నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో రాత్రంతా కురిసిన వానలకు జనజీవనం స్తంభించి పోయింది. అనేక చెరువులు, కుంటలు రాత్రికి రాత్రే నిండిపోయాయి. వాగులు పొంగిపొర్లాయి. పలు జిల్లాలో 2 రోజులు బడికి సెలవు వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటన ఆన్‌లైన్‌ తరగతులకు పలు స్కూళ్ల ఏర్పాట్లు రాబోయే 3 రోజులు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం బుధ, గురు వారాల్లో సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వేల్పూర్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హనుమకొండ, జనగామ, వరంగల్‌లో కొన్ని చోట్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. నిజామాబాద్‌ జిల్లా వెల్పూర్‌లో అత్యధికంగా 40 సెం.మీ, జక్రాన్‌పల్లి, భీంగల్‌ 23, వరంగల్‌ జిల్లా సంగెం 22, నెల్లబల్లిలో 17, హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ 17, జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ 16, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ 14, సాయంపేట, పరకాల, మోర్తాడ్‌, ఆర్మూర్‌లో 14, వరంగల్‌ జిల్లా పర్వతగిరి, ములుగులో 13, బోనకల్‌, పాలకుర్తి, డోర్నకల్‌లో 12, చెన్నారావుపేట, శ్రీరాంపూర్‌, కూసుమంచి, మహబూబాబాద్‌లో 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.