ప్రయాణికులను వణికించిన విమానం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలను దారి మళ్లించడం మనం చూస్తూనే ఉంటాం. ఆకాశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతే.. ఆ సమయంలో ప్రయాణిస్తున్న విమానాలను దారి మళ్లించడం లేదా దగ్గర్లో ఉన్న విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాటిని తిరిగి పంపిస్తూ ఉంటారు. అయితే ఆకాశంలో మేఘాలు అడ్డువచ్చినపుడు విమానాలు కుదుపులకు లోను కావడం సర్వసాధారణమే. అందుకే విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏవైనా మేఘాలు వచ్చినపుడు.. అందులో ఉన్న ఎయిర్‌లైన్స్ సిబ్బంది.. ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ అయినపుడు కూడా ప్రయాణికుల సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తారు. అయితే తాజాగా ఆకాశంలో ఓ విమానం అల్లకల్లోలం కావడంతో ఒకరు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి.

సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 SQ 321 విమానం.. లండన్‌లోని హెత్‌రో ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌కు సోమవారం బయల్దేరింది. అందులో 211 మంది ప్రయాణికులు, 18 మంది సింగపూర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందితో కలిసి మొత్తం 229 మందితో గాల్లోకి ఎగిరింది. ఈ క్రమంలోనే ఆ సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ సంఘటనలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే చనిపోయినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. ఇక ఇదే ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.