కాలుష్యము లేని వాతావరణమే భావితరాలకు సంపద

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ జీవన విధానం బతుకు చిత్రమంతా చెట్టు పుట్టలతోనే ముడిపడి ఉంది.  పండుగలు,  సంస్కృతిలో చెట్ల పాత్ర కీలకమైనదని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి లిల్లీ మేరీ అన్నారు.  మనిషి పుట్టగానే వేసే ఉయ్యాల నుంచి చనిపోగానే కాల్చే కట్టే వరకు చెట్లతోనే అంత ముడిపడి ఉందని  ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి లిల్లీ మేరీ అన్నారు.  దసరా పండుగకు జమ్మి చెట్టు,  బతుకమ్మ పండుగకు తంగేడు చెట్టు,  బోనాల పండుగకు వేప చెట్టు … ఇలా అన్ని పండుగలు చెట్లతోనే ముడిపడి ఉన్నాయని చెప్పారు.  కాబట్టి ప్రతి పండుగ రోజున కేకులు కట్ చేయడం ఎంత ముఖ్యమో…  మొక్కలు నాటడం అంతే ప్రాధాన్యతగా గుర్తించాలన్నారు.  చనిపోయిన వారి పేరిట కూడా మొక్కలు నాటాలని లిల్లీ మేరీ పిలుపునిచ్చారు.  గతంలో తెలంగాణలో విస్తారమైన అడవులు ఉండేవని రాను రాను అవి అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ జీవన విధానంతో అనుబంధం ఉన్న చెట్లను నాటి అయితే వనాలు ఏర్పాటు చేయటం అవసరమన్నారు హరితవనాలి ఏర్పాటు చేయటం అవసరం అన్నారు.  రాబోయే తరాలకు ఎంత సంపద చేస్తామనేది ముఖ్యం కాదని … కాలుష్యం లేని వాతావరణము అందజేయడం కీలకమన్నారు.  చెట్లు అంతరించిపోవటం మూలంగానే అడవుల్లో ఉన్న కోతులు ఊళ్ళల్లోనికి కోతులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.