ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో హమాలి మృతి

.. రుద్రూర్ లో రోడ్డు ప్రమాదం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ సమీపంలో ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనానికి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల శివారు ప్రాంతంలో ఓ రైస్ మిల్లులో పనిచేసే హమాలీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జరిగింది, ఈ సందర్భంగా కుటుంబీకులు స్థానికులు మాట్లాడుతూ, కోటగిరి మండలం జల్లా పల్లి ఫారం గ్రామానికి చెందిన బర్మా వత్ రాజు (35) సొంత గ్రామమైన జలపల్లి ఫారం నుండి ప్రతి రోజులాగే ఆదివారం ఇంటి నుంచి రుద్రూర్ మండల కేంద్రం శివారు ప్రాంతంలో ఉన్న రైస్ మిల్ కు వెళ్లి పనిలో నిమగ్నమై ఉన్నాడని, పనిలో భాగంగా రుద్రూర్ బస్టాండ్ కు వచ్చి మళ్లీ తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై రైస్ మిల్ కు వెళ్తుండగా శశిరేఖ గార్డెన్ సమీపంలో బస్టాండ్ నుంచి బోధన్ కు వెళుతున్న బోధన్ డిపోకు చెందిన బస్సు మృతుడు వెళుతున్న వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు, విషయం తెలుసుకున్న రుద్రూర్ పోలీసులు , ఎస్సై రవీందర్ అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు, మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో రైస్ మిల్ లో హమాలీ గా సుమారు గత ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడని, మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారని వారు తెలిపారు. శశిరేఖ గార్డెన్ సమీపంలో తరచూ ప్రమాదాలు జరగడం, ఆనవాయితీగా మారింది అని, ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతో మందికి గాయాలు కాగా కొంతమంది మృతి చెందిన సంఘటన జరిగింది, అని ప్రజలు తెలుపుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగవు అని పలువురు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.