200 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తు సముద్రంలో చిక్కుకుపోయిన షిప్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 200 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ విలాసవంతమైన క్రూయిజ్‌ షిప్‌ సముద్రంలో చిక్కుకుపోయింది. ప్రముఖ వార్తా సంస్థ ఇండిపెండెంట్‌ నివేదిక ప్రకారం.. మూడు వారాల ట్రిప్ కోసం ఈ నెల 1న బయలుదేరిన నౌక 22న తిరిగి పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితేగ్రీన్‌ల్యాండ్ రాజధాని నుక్‌ కు 850 మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం ఈ నౌక సముద్రంలో చిక్కుకుపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం నౌకలోని ప్రయాణికులుసిబ్బందితో కలిసి 206 మంది ఉన్నారని.. అందరూ క్షేమంగా ఉన్నట్టు వెల్లడించింది. రెస్క్యూ షిప్ శుక్రవారం వరకు అక్కడకి చేరుకునే పరిస్థితి లేదని పేర్కొంది. మరోవైపు ఈ ట్రిప్‌ కోసం షిప్‌ యాజమాన్యం ఒక్కో ప్రయాణికుడి నుంచి దాదాపు రూ. 27 లక్షలు (33 వేల డాలర్లు) వసూలు చేశారు.ప్రస్తుతం నౌకలోని వారంతా క్షేమంగా ఉన్నట్లు షిప్‌ ఆపరేటర్‌ తెలిపారు. షిప్‌లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే ప్రయాణికుల్లో కొందరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో కాస్త ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివ్‌గా తేలిన వారిని ఓ గదిలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.