విద్యార్థినిల పట్ల అసబ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి దేహశుద్ది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి విద్యార్థినీలు, తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లెకెళితే జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో ఉన్న మోడ్రన్ ఎయిడెడ్ పాఠశాలలో బయాలజికల్ రమణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయుని రూపంలో ఉన్న ఈ కామాంధుడు కొంతకాలంగా విద్యార్థినీల పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు జేయడంతో శుక్రవారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడి పై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. రమణ పై చర్యలు తీసుకోవాలని పాఠశాల అవరణలో బైఠాయించారు. విద్యార్థినీలు, విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాద్యాయుడు రమణ ఇష్టారీతిన మాట్లాడడంతో వారు రమణను చితకబాదారు. అనంతరం ఒకటవ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలోనే పాఠశాలకు చెందిన పై అధికారులు రమణను సస్పెండ్ చేయాలని అదేశించినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.