అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో మొత్తం 16 గంటల సమయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో మొత్తం 16 గంటల సమయం కేటాయించారు. బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్‌కి 1 గంట 9 నిమిషాలు, డీఎంకేకి 30 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 30 నిమిషాలు, వైఎస్సార్సీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, జేడీయూకి 21 నిమిషాలు, బీజేడీకి 16 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు, బీఆర్ఎస్‌కి 12 నిమిషాలు, ఎల్‌జేఎస్పీకి 8 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించారు. మిగిలిన ఎన్‌డీఏ అనుకూల పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 17 నిమిషాలు కేటాయించారు. ఇందులో అన్నాడీఎంకే, ఏజేఎస్‌యూ, ఎంఎన్ఎఫ్, ఎన్‌పీపీ, ఎస్‌కేఎం వంటి పార్టీలు ఉన్నాయి. ఇక ఎస్‌పీ, ఎన్‌సీపీ, సీపీఐ, టీడీపీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలన్నింటికి కలిపి 52 నిమిషాల సమయం ఇచ్చారు. బీజేపీ తరపున 15 మంది వక్తలు మాట్లాడనున్నారు. నిషికాంత్ దూబే మొదటి వక్తగా వ్యవహరిస్తారు.

Leave A Reply

Your email address will not be published.