కొండచిలువలకు-చలిచీమలకు మధ్య యుద్ధం జరుగుతోంది

.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఎస్పీ మునుగోడులో వేసిన మొదటి స్టెప్ సంతోషాన్ని కలిగించిందని.. ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. తాము అధికారం, డబ్బు ఉపయోగించలేదని.. ఒక్క పైసా ఇవ్వకుండా పోటీ చేశామని స్పష్టం చేశారు. మునుగోడులో చాలా కష్టపడ్డామని వివరించారు. ఒక్క రోజులోనే ఏదీ సాధ్యం కాదని.. రాబోయే రోజుల్లో బీఎస్పీ ప్రభావం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు తొందరగా ఏ నిర్ణయానికి రాలేరని చెప్పారు. బహుజన వాదాన్ని చాలా సీరియస్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లామని వివరించారు. ‘కేసీఆర్, మోదీ తమతమ అధికారాన్ని మునుగోడులో ప్రదర్శించారు. 35-40 రోజులుగా మద్యం, మాంసం పంచారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఎస్పీ ప్రభావం ఇంకా ఉంటుంది. అన్నిచోట్ల మునుగోడు తరహా ఎన్నిక జరగదు. ప్రజలకు వారివారి సమస్యలను వివరించే ప్రయత్నం చేశాం. కొండచిలువలకు-చలి చీమలకు మధ్య యుద్ధం జరుగుతోంది. వాపును బలుపు అనుకునే వారికి త్వరలోనే సమాధానం చెప్తాం. లెఫ్టిస్టులు వారి భావజాలాన్ని వదులుకున్నారు. కమ్యూనిస్టూ పార్టీలో అసలు బహుజనులకు స్థానం ఉందా.’ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కేవలం జెండాలు మోసేవారేనా. 1948-49లో దోరలకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులు.. ఇప్పుడు వారి పంచనే చేరారు. కమ్యూనిస్టులు ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్లి వారి సిద్ధాంతాలను వివరించాలి. బహుజనులకు ఎందుకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం లేదు. జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాశ్ నారాయణ లాగా నేను మిగిలిపోను. కచ్చితంగా తెలంగాణలో ప్రభావం చూపుతా. ప్రజల్లోకి వెళ్లి అన్ని విషయాలను వివరిస్తా. ఐదో రౌండ్‌ వరకు వచ్చిన 1237 ఓట్లు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ఒక్క పైసా ఇవ్వకున్నాప్రజలు మమ్మల్ని నమ్మారు’ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.