పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టి మహిళలకు చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే  మహిళ బిల్లులో బి.సి. మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బి.సి మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు డా అనుసూరి పద్మ లత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రదాన మంత్రి నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేసారు.నూతన పార్లమెంట్ భవనం లో మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో మహిళ బిల్లు పెట్టి గత 20 సంవత్సరాల బిసి మహిళల ఆకాంక్షలను నేరవేర్చగలరన్నఆశా భావాన్ని వ్యక్తం చేసారు. పార్లమెంటులో మహిళ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి అందులో  బి.సి. మహిళలకు జనాభా ప్రకారం సబ్-కోటా ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు.మహిళ బిల్లులో బి.సి మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మహిళ బిల్లుకు సార్ధకత లేదన్నారు.  ఇప్పటికే మహిళ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్ సభలో కూడా పెట్టి పూర్తి చేయాలని కోరారు. మహిళా బిల్లు గురించి గొంతులు చించుకొని మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులు బి.సి మహిళల గురించి, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి, అత్యాచారాల గురించి  ఎందుకు మాట్లాడటం లేదని పద్మ లత ప్రశ్నించారు.మహిళ బిల్లు పాస్ కావాలంటే బి.సి మహిళలకు సబ్-కోటా ఇవ్వక తప్పదు. జనాభాలో సగం ఉన్న బి.సి.మహిళలకు కోటా ఇవ్వకుండా మహిళల గురించి మాట్లాడటం అన్యాయమన్నారు.మహిళ బిల్లులో రాజకీయ రిజర్వేషన్ల తో పాటు విద్యా – ఉద్యోగాలలో కూడా 50 శాతం రిజర్వేషన్ల ను ప్రవేశపెట్టాలని కోరారు రాజకీయ రిజర్వేషన్ల ను పెడితే 180 మంది మహిళలు పార్లమెంటులో సభ్యులవుతారు. కాని ఉద్యోగాలలో రిజర్వేషన్లుపెడితే కేంద్ర ప్రభుత్వం లోని 54 లక్షల ఉద్యోగాలలో, 27 లక్షల ఉద్యోగాలు, 29 రాష్టలలో కలిపి ఒక కోటి 80 లక్షల ఉద్యోగాలలో 90 లక్షల ఉద్యోగాలు మహిళలకు దక్కుతాయని అన్నారు.మహిళలకు రక్షణ కోసం ఇప్పటికీ అనేక చట్టాలు ముఖ్యంగా వరకట్న నిషేద చట్టం ,అత్యాచార, నిరోధక చట్టం, నిర్భయ చట్టం ,బాల్య వివాహాల నిరోధక చట్టం, దిశా చట్టం లాంటి 19 చట్టాలు వచ్చిన్నపటికి వారి పై అత్యాచారాలు తగ్గలేదు. పురుశాదిక్యత తగ్గలేదు మహిళల రక్షణ కోసం మరిన్ని చట్టాలు తేవలసిన ఆవసరం ఉందన్నారు. మహిళా చట్టాల పట్ల మహిళలను చైతన్యం చేయాలని, అధికారంలో వాటా ఇవ్వాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.