రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

మునుగోడు ఉప ఎన్నికల  ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఎక్సైజ్ , క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పలు కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న దాదాపు 40 ప్రైవేట్ కంపెనీలలో సుమారు 12,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని వీరందరినీ కలిసి ఓట్లు అభ్యర్థించాలని మంత్రి కార్మిక సంఘాల నాయకులకు సూచించారు. ప్రతి కంపెనీ గేటు దగ్గరికి వచ్చి కార్మికులను కలిసి టిఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించడానికి వారి ఓట్లను అభ్యర్థించాలని కార్మిక సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన వివిధ పథకాలను వివరించాలని మంత్రి కార్మిక సంఘాల నాయకులకు కోరారు. ప్రతి కంపెనీ వద్ద గేట్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని ప్రతి సమావేశానికి తాను హాజరై కార్మికులను కలిసి ప్రభుత్వ పథకాలను వివరించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని ఆయన కార్మిక సంఘాల నాయకులకు తెలిపారు. చౌటుప్పల్ లో కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి లేదన్న విషయాన్ని మంత్రి దృష్టికి కార్మిక సంఘాల నాయకులు తీసుకురాగా ఎన్నికలు పూర్తయిన వెంటనే చౌటుప్పల్ లో ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయిస్తామని ఈ విషయాన్ని నేరుగా కార్మికులకే తెలియజేద్దామని మంత్రి స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అయ్యిందని చౌటుప్పల్ ప్రాంతంలో పరిశ్రమలు రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందజేసిందని అందుకే ఈ ప్రాంతంలో అనేకమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని ఈరోజు చౌటుప్పల్ పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలే కారణమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ విషయాలన్నీ వివరించి కార్మిక సోదర కుటుంబాల ఓట్లు కూడా టిఆర్ఎస్ కు పడేలా కలిసి ప్రయత్నం చేద్దాం అని ఆయన ఈ సమన్వయ సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేష్ గౌడ్, పి శంకర్, ఎండి ఇమ్రాన్, వి.మారయ్య యాట కృష్ణ, ఎండి పాషా మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.