రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రమాదం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రమాదం ప్రమాదం జరిగింది. ఆలూరు నుంచి ఆదోనికి వస్తున్న రాహుల్ కాన్వాయ్ ఓ కానిస్టేబుల్ ను గుద్దడంతో అయన కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

చికిత్స నిమిత్తం కానిస్టేబుల్ ను ఆదోని ఆసుపత్రికి తరలించారు. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో తొలి రోజు మంగళవారం జోష్ గా సాగింది. రైతుల సమస్యలు వింటూ.. యువతను ఉత్సాహపరుస్తూ.. మహిళలు, విద్యార్థులు, అన్నదాతలతో కలసి అడుగులు వేస్తూ రాహుల్ పాదయాత్ర సాగించారు.

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో పాదయాత్ర ముగించిన రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం 7.10 గంటలకు కర్నూలు జిల్లాలోని హాలహర్వి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతోపాటు రాష్ట్ర, జాతీయ నాయకులతో కలసి పాదయాత్ర సాగింది. హాలహర్వి కురువళ్లి, అగ్రహారం మీదుగా 8.58 గంటలకు ఆలూరు సమీపంలో ఏర్పాటు చేసిన విశ్రాంతి శిబిరానికి చేరుకున్నారు. సాయంత్రం 4.00 గంటలకు మళ్లీ పాదయాత్ర చేపట్టి హొళేబీడు, మణేకుర్తి వరకు సాగించారు. తొలి రోజు జిల్లాలో 24 కి.మీలు నడిచారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. తెలుగింట అనూహ్య స్పందన రావడంతో రాహుల్ ఆనందంతో ఉప్పొంగిపోయారు ఉప్పొంగిపోయారు.

Leave A Reply

Your email address will not be published.