కార్మికులకు ప్రమాద బీమా పథకకాన్ని పది లక్షలకు పెంచాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డిజిటల్ లేబర్ కార్డు  కలిగిఉన్న భవననిర్మాణ కార్మికులకు  పలు ప్రమాదఆకరమైన వ్యాధులకు రోగ్యశ్రీ పథకం ద్వారా  10 లక్షల రూపాయల వరకు  రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు ప్రకటించడాన్ని బీసీ సేన తరఫున స్వాగతిస్తున్నట్లు  బీసీ సేన కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్ కార్మిక విభాగం మండల అధ్యక్షులు ఆకుల చంద్రమౌళి తెలిపారు. జడ్చర్ల మండల విద్యావానుల కేంద్రం ఆవరణలో బిసి సేన ముఖ్య నాయకులు సమావేశంలో బీసీ సేన కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్ అద్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా సురభి విజయ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో అత్యంత నిరుపేదలే పని చేస్తారని  కార్మికులకు ప్రమాద బీమా పథకకాన్ని పది లక్షల రూపాయలకు పెంచాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల  కుమార్తెల పెళ్లిలకు  రాష్ట్ర ప్రభుత్వం  30 వేల రూపాయల నుండి  లక్ష యాభై వేల రూపాయలకు పెంచాలని,  పని ప్రదేశంలో కార్మికునికి ఏదైనా ప్రమాదం జరిగితే ఉచిత చికిత్స తో పాటు ఐదు లక్షల ఎక్స్ గ్రేసీయా అందించాలని ,  కార్మికుల పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం  కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా చదివించాలని చదువు పూర్తి చేసిన యువతకుఉపాధి కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో బీసీసేన నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిలింగం పేట్ శేఖర్, మండల అధ్యక్షులు బొల్లె మోని నిరంజన్, కార్మిక విభాగం మండల అధ్యక్షులుఆకుల చంద్రమౌళి,జిల్లా నాయకులు మాచారం శ్రీనివాస్, కట్ట మురళి మండల కార్యదర్శి సురభి రఘు,రమేష్,సురభి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.