కవిత దర్యాప్తులో కెసిఆర్ ప్రగతి భవన్ నుండే యాక్షన్ ప్లాన్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు సంబంధించిన పరిణామాలను హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ నుంచే కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. పార్టీ నేతలకు ఫోన్ చేసి ఢిల్లీలోని పరిణామాలపై ఆరా తీస్తున్నారు. కవిత ఈడీ విచారణ, అరెస్ట్ జరిగితే ఏం చేయాలనే దానిపై ప్రగతిభవన్‌లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ ఢిల్లీకి పంపించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి బయర్దేగా.. కాసేపట్లో మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే కవిత అరెస్ట్ జరిగితే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు. ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనలు చేయాలని నిర్ణయించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈడీ ఆఫీస్ ఎదుట బైఠాయించనున్నారు. ఆప్ మద్దతుతో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఆప్ నేతలతో బీఆర్ఎస్ నాయకులు చర్చలు జరుపుతున్నారు.కవిత విచారణ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందలో భాగంగా హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.అయితే ఢిల్లీలో కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. వివిధ అంశాలపై ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో నలుగురు సభ్యులు బృందం కవితను ప్రశ్నిస్తోంది. ఈ బృందంలో మహిళా అధికారి కూడా ఉన్నారు. రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబులతో కలిసి కవితను ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 11 గంటలకు కవిత ఈడీ విచారణ ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే కవిత విచారణను వీడియో షూట్ కూడా చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.