కార్పోరేట్ విద్యాసంస్థలపై కూడా చర్యలు తెసుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నగరంలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం కలెక్టరేట్ ముట్టడికి ఏబీవీపీ యత్నించింది. విద్యా సమస్యలపై ఆందోళనకు దిగిన ఏబీవీపీ కలెక్టరేట్‌ వద్ద నిరసనకు దిగింది. ఫీజు రీయింబర్స్మెంట్స్కాలర్‌షిప్ వెంటనే చెల్లించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలుకాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అధిక ఫీజులు వసూల్ చేస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లనీయడంతో అడ్డుకోవడంతో ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అటు.. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నాకు దిగింది. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.