జర్నలిస్ట్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన మీడియా పై చర్యలు

- పార్లమెంట్లో ఎంపీ ఆదాల అడిగిన ప్రశ్నకు మంత్రి సమాదానం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఢిల్లీ:  దేశంలో నకిలీ వార్తల నియంత్రణకు ఏ విధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. నకిలీ వార్తలను ప్రసారం చేసినందుకు ఏ విధమైన చర్యలు తీసుకున్నారని కూడా అడిగారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దీనికి రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ నకిలీ వార్తల నియంత్రణకు చట్టబద్ధమైనసంస్థాగత యంత్రాంగం ఉందని తెలిపారు. ప్రింట్ మీడియా కోసం ప్రెస్ కౌన్సిల్ చట్టం ఉందనిదాని కింద జర్నలిస్ట్ ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 2021లో నకిలీ వార్తలు ప్రచురించిన ఐదు వార్తాపత్రికలపై ప్రెస్ కౌన్సిల్ చర్యలు తీసుకుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా కోసం కేబుల్ టీవీ నెట్వర్క్ నియంత్రణ చట్టం ఉందని పేర్కొన్నారు. ఈ చట్ట నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డిజిటల్ మీడియా ప్రచురించే వార్తలపై  మూడంచెల యంత్రాంగం నిఘా ఉంటుందని పేర్కొన్నారు. 2021లో తప్పుడు వార్తలు ప్రచురించిన 14 యూట్యూబ్ చానల్స్45 వీడియోలు25 సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేసినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.