చురుకుగా కదులుతున్ననైరుతి రుతుపవనాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యంగా ఈశాన్యా రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రాబోయే రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.’’ అని వాతావరణ శాఖ సీనియర్ అధికారి నరేష్ కుమార్ తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు యూపీకి వాతావరణశాఖ హెచ్చరికలు పంపింది. అలాగే ఉత్తర బెంగాల్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో జూలై 2 నుంచి 7 మధ్య ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. డార్జిలింగ్కాలింపాంగ్జల్పాయిగురికూచ్‌బెహార్అలీపుర్‌దువార్ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో ఉత్తర బెంగాల్‌లోని మిగిలిన జిల్లాలో కూడా ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.