మనుశ్రీ కోసం దిగివచ్చిన ఆదాని

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నాలుగేళ్ల చిన్నారి మనుశ్రీ తిరిగి తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలని ఆకాంక్షించారు ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ (Gautam Adani). ఆ పాపకు గుండె చికిత్స కోసం తమ కుటుంబ సభ్యులు సాయం చేయాలని ట్విట్టర్‌లో అభ్యర్థించగా.. అదానీ ప్రతిస్పందించారు. పాప కుటుంబసభ్యులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని, పాప కోలుకునేందుకు అవసరమైన సాయం చేయాలని అదానీ ఫౌండేషన్‌ను (Adani Foundation) ఆదేశించారు గౌతమ్ అదానీ. వేరొకరు చేసిన ట్విట్టర్ పోస్టును ట్యాగ్ చేస్తూ అదానీ.. ఇలా వ్యాఖ్యానించారు.ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని సరోజినీ నగర్ ప్రాంతంలో నివసించే నాలుగేళ్ల మనుశ్రీ (Manushree).. గుండెలో చిన్న రంధ్రం ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI) వైద్యులు.. ఆమె ట్రీట్‌మెంట్ కోసం రూ. 1.25 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అయితే ఆ కుటుంబం ఆదాయం చాలా తక్కువ అని, వారిని ఆదుకోవాలని ఒక UPI కోడ్‌ను కూడా షేర్ చేశారు అషుతోష్ త్రిపాఠీ అనే ఒక వ్యక్తి. దీనికి అదానీ బదులిచ్చారు.దీనికి అదానీ వెంటనే స్పందించిన నేపథ్యంలో.. నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి మానవత్వం చాటుకొని.. ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారని చాలా మంది ట్వీట్లు చేశారు. ఇంత మంచి సాయం చేస్తున్న అదానీ.. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పలువురు ఆకాంక్షించారు.ALSO READ: ఇంటి దగ్గర కూర్చొని వ్యాపారం.. రూ.5 వేల పెట్టుబడితో నెలకు లక్షల్లో ఆదాయం.. అదేంటంటే?అదానీ వ్యాపారంలోనే కాకుండా.. దాతృత్వంలోనూ ముందంజలో ఉన్నారు. తన అదానీ ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. అక్టోబర్ 21న వెలువడిన.. ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ 2022లో గౌతమ్ అదానీ ఏడో స్థానంలో నిలిచారు. భారత్ కొవిడ్-19 మహమ్మారితో కొట్టుమిట్టాడిన సమయంలోనూ అదానీ ఫౌండేషన్ రూ.122 కోట్ల సాయం అందించినట్లు పలు రిపోర్టుల్లో తెలిసింది. హురూన్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్‌లో రిలయన్స్ ఫౌండేషన్ (Relaince Foundation) ద్వారా సేవలందించే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మూడో స్థానంలో ఉన్నారు. ఆయన కూడా హెల్త్ కేర్ సహా ఎడ్యుకేషన్ రంగంలో సేవలు అందిస్తున్నారు. ఇటీవల వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న గౌతమ్ అదానీ.. తన పెట్టుబడులను విస్తరిస్తున్నారు. హెల్త్ కేర్ సెక్టార్‌లోనూ ఏకంగా 7 నుంచి 10 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్ పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ (Adani Group) ప్రతినిధి చెప్పారు. ఇది ఇన్సూరెన్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ అండ్ ఫార్మాష్యూటికల్స్ విభాగాల్లో ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిసింది. కొంతకాలం కిందట గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకడం విశేషం. ఆ తర్వాత అదానీ షేర్లు (Adani Shares) పడిపోయిన తరుణంలో మళ్లీ మూడో స్థానానికి పడిపోయారు. ఆయన సంపద దాదాపు 120 బిలియన్ డాలర్లపైనే ఉంది. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.READ LATEST Business News and Telugu News20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.ALSO READ: కూతురి పెళ్లి కోసం ఇప్పటినుంచే డబ్బు కూడబెట్టండి.. ఏడేళ్లలో ఇలా రూ.50 లక్షలవుతాయ్.. ఇక రంది లేకుండా!

Leave A Reply

Your email address will not be published.