టార్గెట్ దిశ‌గా దూసుకెళ్తోన్న ఆదిత్య‌-ఎల్‌1  

- సెల్ఫీ తీసుకున్న ఆదిత్య-ఎల్‌1.. వీడియో షేర్ చేసిన ఇస్రో

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సూర్యుడి అధ్య‌య‌నం కోసం చేప‌ట్టిన ఆదిత్య‌-ఎల్‌1టార్గెట్ దిశ‌గా దూసుకెళ్తోంది. అయితే ఆగ‌స్టు 4వ తేదీన ఆదిత్య సెల్ఫీ తీసుకున్న‌ది. ఆ ఫోటోను ఇవాళ ఇస్రో షేర్ చేసింది. త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఆ పిక్‌కు చెందిన వీడియోను పోస్టు చేసింది. ఆదిత్య ఎల్‌1కు ఉన్న కెమెరాకు.. వీఈఎల్‌సీ, ఎస్‌యూఐటీ ప‌రిక‌రాలు ఆ ఫోటోలో స్ప‌ష్టంగా క‌నిపించాయి. ఇక ఆదిత్య కెమెరాల‌కు భూమి, చంద్రుడు కూడా చిక్కాయి. ఆ ఫోటోల‌ను కూడా ఆగ‌స్టు 4వ తేదీన ఆదిత్య తీసింది. సెల్ఫీతో పాటు భూమి, చంద్రుడు ఉన్న వీడియోను ఇస్రో ట్వీట్ చేసింది. 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఎల్‌1 పాయింట్ వ‌ద్ద‌కు ఆదిత్య వెళ్తున్న విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.