సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్ 1 ప్రయోగం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ57 ద్వారా ప్రయోగం ‘చంద్రయాన్‌-3’ విజయంతో.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమైంది. ‘ఆదిత్య ఎల్‌-1’ ప్రయోగ తేదీని ఈ మేరకు ప్రకటించింది. సెప్టెంబర్‌ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్‌ చేసింది. ”సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్‌-1 ప్రయోనికి సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి సెప్టెంబర్‌ 2న 11.50కి పీఎస్‌ఎల్‌వీ-సీ57 ప్రయోగం చేపట్టనున్నాం” అని తెలిపింది. శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాన్ని లాంచింగ్‌ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ప్రజలను ఆహ్వానించింది. ఇందుకోసం వెబ్‌సైట్‌ (https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp) ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించింది. రేపటి (ఆగస్టు 29) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.