ఆదివాసీలపై వైమానిక బాంబుదాడులు నిలిపివేయాలి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆదివాసీలపై వైమానిక బాంబు దాడులు నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ డిమాండ్ చేసారు.ఆదివాసులపై జరుగుతున్న వైమానిక దాడులు అమానుషమని ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు.  27 న  హైదరాబాద్ లో  జరిగే రేపు 55వ వసంత విప్లవ మెగా గర్జన నక్సల్ బరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. దండకారుణ్యం శత్రు దేశమా? దండకారణ్యం ఆదివాసీలపై వైమానికదాడులు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడి వర్గం విదేశీ కార్పొరేట్ కంపెనీల అడవి దోపిడీ కోసం అవకాశం ఇవ్వటం ప్రారంభించిన అన్నారు. మానవ సంబంధాల్లో సంక్షేమంతో పాటు నిర్బంధం పెరిగి పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారని, సిబిఎస్సి సిలబస్ లో ప్రజాస్వామ్యం అనే పదం తీసివేయడం దుర్మార్గమైన చర్యఅని అన్నారు.దీనిని అమానుషంగా పాలకులు అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు రాజ్యాంగం వారికి అడ్డు వస్తుందనే ఉద్దేశం తో కాషాయ కూటమి కుట్ర చేస్తుందని అని విమర్శించారు. దేశం భవిష్యత్తును ప్రజాస్వామ్యాన్ని అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఉందని ప్రభాకర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.