అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తే తమ రికార్డులలో ‘ఇండియా’ పేరును ‘భారత్‌’గా మార్పు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: భారత దేశం అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తే తమ రికార్డులలో ఇండియా’ పేరును భారత్‌గా మార్చేందుకు అంగీకరిస్తామని యునైటెడ్‌ నేషన్స్‌ ( ఐక్యరాజ్యసమితి) తెలిపింది. భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రధాన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేరు మార్పు కోసం భారతదేశం అన్ని లాంఛనాలు పూర్తి చేసి తమకు తెలియజేస్తే యూఎన్‌ రికార్డులలో ఆ మేరకు మార్పులు చేస్తామని తెలిపారు.కాగారాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ20 అతిథులను విందుకు ఆహ్వానించిన పత్రాల్లో ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’ బదులు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ గా పేర్కొన్నారు. అలాగే మోదీని భారత్‌ ప్రధానిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇండియా’ పేరును భారత్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రతిపక్షాలతోపాటు పలు రంగాలకు చెందిన నిఫుణులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.