విద్యార్థులకు అలర్ట్.. దీపావళి సెలవు మార్చిన ప్రభుత్వం!

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దీపావళి సెలవు విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు అక్టోబర్ 25న దీపావళి సెలవును ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అక్టోబర్ 24న సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు మంగళవారానికి బదులు సోమవారం సెలవు ఇవ్వనున్నాయి. దీంతో విద్యార్థులకు వరుసగా ఆదివారం, సోమవారం రెండు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25న దీపావళి వస్తుంది. కానీ ఆ రోజు సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి కాబట్టి పండుగ జరుపుకోవడం కరెక్ట్ కాదని పండితులు అభిప్రాయపడుతున్నారు. 24న రాతంత్రా అమావాస్య ఘడియలు ఉంటాయి. కాబట్టి ఆ రోజే పండుగ జరుపుకోవడం సరైనదని పండితులు చెబుతున్నారు. 24న ఉదయం చతుర్దశి ఉండనుండగా.. రాతంత్రా అమావాస్య కొనసాగుతుందని చెబుతున్నారు. అదే రోజన లక్ష్మీ దేవికి పూజ చేసి.. రాత్రి టపాసులు కాల్చాలని సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.