భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని,  డ్రైనేజీ, కాలువలు, చెరువులు, వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకూడదని పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని,  ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకూడదని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి అన్నారు. సామాజిక కార్యకర్తలు, రెడ్ క్రాస్ వాలంటీర్స్, రెడ్ క్రాస్ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వీలైనంత సహకారాలు అందించాలని సాయి చౌదరి అన్నారు.గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభుత్వ పాటశాలలకు తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ప్రకటించడం జరిగిందని, వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు కురిసే అవకాశం ఉన్నందున పిల్లలను తల్లితండ్రులు బయటికి వెళ్లకుండా చూసుకోవాలని,  విద్యుత్ స్తంభాలను తాకకుండా జాగ్రతలు తీసుకోవాలని సాయి చౌదరి సూచించారు.

Leave A Reply

Your email address will not be published.