జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్  

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తరప్రదేశ్ వారణాసి లో గల కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు భారత పురావస్తు శాఖ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితేమసీదులో సర్వే చేసేటప్పుడు నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరకూడదని స్పష్టం చేసింది.జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని వారణాసి జిల్లా కోర్టు జులై 21న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు విభాగ అధికారులు జులై 24న సర్వే ప్రారంభించారు. అయితేదీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధించింది. వారణాసి కోర్టు తీర్పుపై మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. ఈ నేపథ్యంలోనే మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయప్రయోజనాలదృష్ట్యాజ్ఞానవాపి మసీదులో సర్వే జరపడం అవసరమని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.