బీఆర్‌ఎస్‌ పదవుల కేటాయింపు

- మహారాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్లను ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. - యూపీ జనరల్‌ సెక్రెటరీగా తివారీకి బాధ్యతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ను స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ముఖ్యంగా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాలపై పూర్తి ఫోకస్‌ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో పార్టీ నేతలను నియమిస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడిగా మానిక్‌ కదమ్‌ను నియమించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌.. తాజాగా ఆ రాష్ట్ర డివిజన్‌ కోఆర్డినేటర్లను నియమించారు.నాసిక్‌ డివిజన్‌ కు దశరథ సావంత్ ‌, పుణె డివిజన్‌ కు బాలసాహెబ్‌ జైరాం దేశ్‌ముఖ్ ముంబై డివిజన్‌ కు విజయ్‌ తనాజి మోహితే ఔరంగాబాద్‌ డివిజన్‌కు సోమ్‌నాథ్‌ థోరట్ నాగ్‌పూర్‌ డివిజన్‌ కు ద్యానేష్‌ వాకుడ్‌కర్ అమరావతి డివిజన్‌కు నిఖిల్‌ దేశ్‌ముఖ్‌ ను కోఆర్డినేటర్లుగా నియమించారు. అదేవిధంగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ బాధ్యతలను హిమాన్షు తివారీకి సీఎం కేసీఆర్‌ అప్పగించారు.

Leave A Reply

Your email address will not be published.