వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి

.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడకతో ఆరోగ్యంచెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో (మన చెత్త-మన బాధ్యత అంటూ ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డులో నడుస్తూ మురికి కాలువలో పేరుకుపోయిన పేపర్లుకవర్లను స్వయంగా తొలగించారు. చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇంటినిఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా కోకాపేటలోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేసిన విషయం తెలిసిందే. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబంసమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నానీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూమలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని సూచించారు. పూల కుండీలుకొబ్బరి చిప్పల్లో నిల్వఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం విషయంలో నివారణ కంటే జాగ్రత్త ఉత్తమం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.