అంబేద్కర్ అందరికీ ఆదర్శ ప్రాయుడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ రామారెడ్డి ప్రతినిధి: అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని సైన్సింట్ , ప్రోఫేసర్ పైడి ఎల్లారెడ్డి అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంగళవారం రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో ప్రధాన కూడళి వద్ద అంబేద్కర్‌ యువజవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని పైడి ఎల్లారెడ్డి పరిశోధకులు , గ్రామ సర్పంచ్ కుషంగీ రాజనర్సు చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసుకున్నామని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి మాట్లాడు తూ, సామాజిక సంస్కరణవాది. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్‌ ఆశయాలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు పథకం తీసుకువచ్చి దళితులను బలోపతమయ్యేలా కృషి చేస్తున్నారన్నారు. విద్యతోనే సామాజిక, ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. త్వరలో రామారెడ్డి మండల కేంద్రాన్ని అన్ని అంగుళాలతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని అన్నారు. అంబేద్కర్ విగ్రహం స్థాపించిన సంధర్భంగా అంబేద్కర్‌ చౌరస్తాగా నామకరణం చేసుకుందా మన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో అంబేద్కర్‌ భవన్‌ ఏర్పాటు చేసుకొని అందులోనే అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసుకుందామ న్నారు. అంటరని తనం అనేది మనం ఇండ్లలో మెదిలే విధనం అనగా ఇంటి వాకిలి చూడగానే ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుఃదో అర్థం చేసుకోవచ్చన్నారు. అంటరని తనం ఏ గ్రామంలో చూసిన కనబడడం , వినబడడం లేదన్నారు. పౌస్టికాహరం తీసుకోవడం వలన అనారోగ్యం పాలు కాకుండా మనిషి దృడంగా తయారు అవుతారన్నారు. పోద్దున్నె చెడు వెసనాలకు బానిసలుగా తయారై తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎన్నొ ఒడిదొడుకులతో ప్రాణాలను కాపాడుకొలేక వీదీన పడ్డ కుటుంబాలు ఉన్నాయని అన్నారు. అది వారు చేసుకున్న తప్పిదమేనని ముక్త కంఠంగ చెప్పారు. యువత పెడదారి పడుతుంది అంటే అది తల్లిదండ్రుల తప్పు ! అని చెప్పవచ్చన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు పోయేల యువతపై ఆదరపడి ఉందన్నారు. పుట్ట గొడుగుల అంబేద్కర్ సంఘాలు పుట్టుకొచ్చి ఏమి సాదిస్తున్నాయని ప్రశ్నించారు. అంబెడ్కర్ అంటే ఒకే సంఘంల కలిసి ఉండాలన్నారు. కులాల పేరు చెప్పుకొని బేదాబిప్రాయలు మనమే సృష్టించుకోని యుద్దానికి సన్నద్దం అవుతున్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ అంబేద్కర్ జాడలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంజిల్ రెడ్డి ,వైస్ ఎంపీపీ రవీందర్ రావు , మోషంపూర్ దత్తన్న , సదాశివ నగర్ మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు, అంబేద్కర్ ఆశయ సంఘ సభ్యులు, కర్రొళ్ల లింగం , జాని , రాములు , రాజు , రాజయ్య , వివిధ రాజకీయ నాయకులు , గ్రామ పెద్దలు , దాతలు. పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.