దేశద్రోహ చట్టానికి వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సవరణలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వివాదాస్పదంగా మారిన బ్రిటిష్‌ కాలం నాటి దేశద్రోహ చట్టానికి వచ్చే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో సవరణలు చేసే అవకాశం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టంచేసింది. భారత శిక్షాస్మతిలోని సెక్షన్ 124 (ఎ) కింద దేశద్రోహ చట్టాన్ని చేర్చారు. ఈ సెక్షన్‌ ప్రకారం.. ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేసినా సదరు నేరస్తులుగా పరిగణించబడుతారు.ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దేశద్రోహ చట్టాన్ని ప్రయోగించడం మొదలుపెట్టాయి. అందుకే ఈ చట్టానికి సవరణలు చేయాలని ఏండ్లుగా డిమాండ్‌లు వస్తున్నాయి. దేశద్రోహ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లు కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన కోర్టు.. చట్టానికి సవరణలు చేయాలని గత మే నెలలోనే ఆదేశించింది.అంతేగాక, దేశద్రోహ చట్టంపై కేంద్రం పునఃసమీక్ష పూర్తయ్యేవరకు.. కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఎవరిమీదా ఈ చట్టాన్ని ప్రయోగించకుండా సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు స్టేపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కేంద్ర పిటిషన్‌ దాఖలు చేసినా.. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Leave A Reply

Your email address will not be published.