ఉక్రెయిన్‌కు యురేనియం షెల్స్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు సిద్దమైన అమెరికా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంక్‌ల‌ను అమెరికా అంద‌జేయ‌నున్న విష‌యం తెలిసిందే. అబ్రామ్స్ యుద్ధ ట్యాంక్‌ల్లో వాడే యురేనియం షెల్స్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు అమెరికా సిద్ధ‌మైంది. ర‌ష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు ఆయుధాల‌ను అమెరికా స‌ర‌ఫ‌రా చేస్తున్నది. అయితే వివాదాస్ప‌ద యురేనియం ట్యాంక్ షెల్స్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వ‌డాన్ని ర‌ష్యా ఖండిస్తోంది.ఇటీవ‌ల అమెరికా దౌత్య‌వేత్త ఆంటోనీ బ్లింకెన్ ఉక్రెయిన్‌లో ప‌ర్య‌టించారు. ఆ స‌మ‌యంలోనే 120ఎంఎం యురేనియం ట్యాంక్ రౌండ్ల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు అమెరికా అంగీక‌రించింది. వీటిని ఎం1 అబ్రామ్స్ ట్యాంకుల్లో వాడ‌నున్నారు. అయితే ఈ ఏడాది చివ‌ర‌కు వ‌ర‌కు ఈ ఆయుధాల‌ను ఉక్రెయిన్‌కు చేర‌వేయ‌నున్నారు.డిప్లీటెడ్ యురేనియం ఆయుధాల‌ను దాడుల‌కు వాడ‌నున్నారు. క్షీణించిన యురేనియంను షెల్లింగ్ ఆయుధాల‌కు ప్లేటింగ్‌గా వాడుతారు. బుల్లెట్ల చివ‌ర‌మోర్టార్ రౌండ్లుట్యాంక్ షెల్స్‌కు కూడా క్షీణించిన యురేనియంను వినియోగిస్తారు. దీని వ‌ల్ల ఆ ఆయుధం క‌చ్చిత‌త్వంతో దూసుకెళ్తుంద‌ని అంచ‌నా.సుమారు 31 ఎం11 అబ్రామ్స్ యుద్ధ ట్యాంక్‌ల‌ను ఉక్రెయిన్‌కు అమెరికా స‌ర‌ఫ‌రా చేయాల‌ని భావిస్తోంది. డిప్లీటెడ్ యురేనియంతో త‌యారైన ట్యాంక్ షెల్‌.. చాలా వేగంగా శ‌త్రు ట్యాంక్‌ల‌ను చేధించ‌గ‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.