భావోద్వేగానికి లోనైన మంత్రి పొంగులేటి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్‌ కోచింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో కార్యకర్తలకు తెలియకుండా ఒంటరిగా కూర్చొని ఎంతగానో ఏడ్చానంటూ ఎమోషనల్ అయ్యారు. అనేక సందర్భాల్లో తన అభిమానులు, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకోవటం చూసి ఎంతో బాధ కలిగేదని.. అలాగని వాళ్ల ముందు బాధపడితే మరింత కుంగిపోతారని దింగమింగుకుని ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు కార్చుకునేవాన్నని వివరించారు. ఆ కష్టం ఊరికేపోలేదన్నారు మంత్రి పొంగులేటి.ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందని.. ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. పుట్టుకతోనే ఎవ్వరూ ధనవంతులు కారని, జన్మతహా ఎవ్వరికి పదవులు రావన్న మంత్రి.. మన మంచితనం, మన ప్రవర్తనే మనకు శ్రీరామరక్షగా ఉంటుందని వివరించారు. ఈ విషయాన్ని అందరూ మనసులో పెట్టుకోవాలని సూచించారు. కష్టం వచ్చినప్పుడు దిగమింగుకోవాలని.. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కచ్చితంగా వస్తుందని చెప్పారు. తాను కష్టం వచ్చిన ఆరోజునే ఎమోషనల్ అయితే దానికి అర్థం ఉండేది కాదని.. ఈరోజు ఇంతగా భావోద్వేగానికి లోనుకావటం వెనుక అర్థాన్ని అర్థం చేసుకోవాలని పొంగులేని తెలిపారు. కష్టసమయంలో తన వెనుక లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు నిలిచారని.. అందుకే ఒక్కసారి కూడా కన్ను చెమ్మగిల్లనివ్వలేదని పేర్కొన్నారు.ఆనాడు ఎంతో మంది తన అభిమానులపై అధికారులు అనేక కేసులు పెడితే.. బిక్కుబిక్కుమంటూ రోజులు గడిపారని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు. అయితే.. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని.. స్వేచ్చ లభించిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అరాచకత్వం ఉండదని.. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతకొచ్చని.. చొరవతో సీఎంను కానీ, మంత్రులను కానీ, అధికారులను కానీ కలిసి తమ కష్టాలు చెప్పుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని.. ఎవ్వరూ దిగులు చెందాల్సిన పని లేదని పొంగులేటి మరోసారి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.